ముంబై టార్గెట్ 175

ముంబై టార్గెట్ 175

ఇండోర్ వేదికగా ఐపీఎల్‌ 2018లో భాగంగా జరిగిన 34వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి... ముంబై ఇండియన్స్ ముందు 175 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై... పంజాబ్‌ను భారీ స్కోర్ సాధించకుండా కాస్త కట్టడి చేయగలిగింది. పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ... తర్వాత వికెట్లు సమర్పించుకుంది. క్రిస్ గేల్ దూకుడుగా ఆడి 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేయగా... స్టోనిస్ 25, కేఎల్ రాహుల్ 24, కురుణ్ నైర్ 23, యువరాజ్ సింగ్ 14, అక్సర్ పటేల్ 13 పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది.