ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు 5 సార్లు కరోనా పరీక్షలు...

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు 5 సార్లు కరోనా పరీక్షలు...

ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుంది అని బీసీసీఐ ప్రకటించిప్పటి నుండి ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అయితే ఈ మధ్య జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఐపీఎల్ తేదీలు బీసీసీఐ ఖరారు చేసింది. దాంతో ఆటగాళ్లు అందరు తమ తమ ప్రాంఛైజ్ ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ కోసం ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు ముంబై‌కి చేరుకుంటున్నారు. ఇప్పటి భారత క్రికెటర్లు కొంతమంది చేరుకోగా.. త్వరలోనే విదేశీ ఆటగాళ్లు రానున్నారు. అయితే ముంబై లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆటగాళ్లను 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఆ సమయం లో వారికి 5 సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ మిగితా అన్ని జట్లకు కేవలం రెండుసార్లు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. యూఏఈ వేదికగా నిర్వహించనున్న ఐపీఎల్ కు ఆగస్టు 26 న అన్ని జట్లు బయలుదేరుతాయి.