ముంబై ఘన విజయం..హిట్ మ్యాన్ మెరుపులు..!

ముంబై ఘన విజయం..హిట్ మ్యాన్ మెరుపులు..!

ఐపీఎల్‌ 2020 లో భాగంగా నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ముంబై ఘాన విజయం సాధించింది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును సాధించింది.కాగా కోల్ కత్తా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ముంబై ఆటగాడు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 80 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించాడు. మరోవైపు సూర్యకుమార్ కూడా 28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఆఫ్ సెంచరీకి దగ్గరగా స్కోర్ చేసాడు. ఇక  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ముంబై 195 పరుగులు చేసింది. కేకేఆర్ జట్టు నుండి కెప్టెన్ దినేష్ కార్తీక్ (30) పరుగులు చేయగా నితీశ్ రాణా (24),  పాట్ కమిన్స్ (33) మినహా జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి కేకేఆర్ 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.