ఐపీఎల్ 2020 : తెరపైకి మళ్ళీ ఫిక్సింగ్ వివాదం...

ఐపీఎల్ 2020 : తెరపైకి మళ్ళీ ఫిక్సింగ్ వివాదం...

ఐపీఎల్ 2020 లో నిన్న అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ముంబై విజయం సాధించి మొదటి స్థానానికి వెళ్ళింది. అయితే ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం నుంచి ఫిక్సింగ్ రూమర్లు వస్తున్నాయి. హోరాహోరీ పోరుల్లో మ్యాచ్‌లు ఎలా ఫిక్స్‌ చేస్తారని కొందరు, ఫిక్సింగ్‌ ఎలాగైనా చేయవచ్చని మరొకందరు అంటున్నారు. అయితే నిన్నటి ముంబై-ఢిల్లీ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఢిల్లీ చేసే ఫైనల్‌ స్కోరును ముంబై ఇండియన్స్‌ ట్విట్టర్ లో రివీల్‌ చేసిందంటూ ఒక వార్త చక్కర్లు కొట్టడమే.

ముంబై ఇండియన్స్ తమ ట్విట్టర్ లో ''ఢిల్లీ 19.5 ఓవర్లలో 163/ 5'' అంటూ పోస్ట్‌ చేసింది. తమ బౌలింగ్‌ ఎటాక్‌ ను జేమ్స్‌ పాటిన్‌సన్‌ తో కలిసి బౌల్ట్‌ పంచుకుంటున్నాడు అని చెప్పే సమయంలో ఢిల్లీ స్కోరు వారి ట్విట్టర్ ‌లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఇది పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైంది. ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దాంతో.. ముందుగా మ్యాచ్‌ ఫిక్స్‌ చేసి ఆడతారా అంటూ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. అయితే ఢిల్లీ స్కోరును ముంబై తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఎందుకు పోస్ట్ చేస్తుంది అనేదానిపై అనుమానాలున్నా అది ముంబై ఇండియన్స్‌ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ కావడంతో అభిమానుల్లో అనుమానాలకు తావిస్తోంది.