ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ముంబై.. బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ముంబై.. బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్

ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకు ఈ ఐపీఎల్ లో ఇది మూడో మ్యాచ్. ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఒక్క విజయం నమోదు చేయగా సన్‌రైజర్స్ రెండు ఓడిపోయి ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ లో ముంబై పై మెరుగైన రికార్డు ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందో.. లేదో చూడాలి.

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్య, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్