ఐపీఎల్ 2020: ముంబై భారీ స్కోర్... రాజస్థాన్ టార్గెట్ 194 పరుగులు 

ఐపీఎల్ 2020: ముంబై భారీ స్కోర్... రాజస్థాన్ టార్గెట్ 194 పరుగులు 

ఐపీఎల్ 2020 మ్యాచ్ లో 20 వ మ్యాచ్ ఈరోజు అబుదాబి వేదికగా జరుగుతున్నది.  ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఓపెనర్లు డి కాక్, రోహిత్ శర్మలు తక్కువ స్కోర్ కే ఔటైనా... సూర్యకుమార్ రాణించడంతో పాటుగా హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడటంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు 193 పరుగులు చేసింది.  డికాక్ 23, రోహిత్ శర్మ 35, సూర్యకుమార్ యాదవ్ 79, కృనాల్ పాండ్య 12, హార్దిక్ పాండ్య 30 పరుగులు చేశారు.  వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన సుర్యకుమార్ చివరి వరకు క్రీజ్ లోనే ఉండటంతో ముంబై జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.  ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవాలంటే 194 పరుగులు చేయాలి.  స్మిత్, సంజు శాంసన్, తెవాతియా తో పటిష్టంగా ఉన్న రాజస్థాన్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.