టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై..

ఐపీఎల్-11లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగునున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస అపజయాలతో సతమతమవుతున్న రెండు జట్లకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చెన్నై, హైదరాబాద్, పంజాబ్ జట్లను దాటి టాప్ లో చోటుదక్కించుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లది. అయితే  చెన్నైపై విజయం సాధించిన ముంబైకి కొంత కలిసొచ్చే అంశం అయినా.. దూకుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక బెంగళూరు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తంగా సాగనుంది. ఇరుజట్లు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ముంబైకి పోలార్డ్, బెంగళూరుకు సుందర్ అందుబాటులోకి వచ్చారు.

జట్లు:
ముంబై: సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇశాన్ కిషన్, జీన్ పాల్ డుమినీ, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పోలార్డ్, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లెన్‌గాన్, మయాంక మార్ఖండే, జస్ప్రీత్ బుమ్రా.


బెంగళూరు: క్వింటన్ డి కాక్, బ్రెండన్ మెక్‌కల్లమ్, విరాట్ కోహ్లీ, మనాన్ వోహ్రా, మన్‌దీప్ సింగ్, కొలిన్ డి గ్రాండ్‌‌హోం, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, యుజవేంద్ర చాహల్.