రోహిత్ కెప్టెన్సీ నుండి ముంబైకి కలిసిరాని మొదటి మ్యాచ్...

రోహిత్ కెప్టెన్సీ నుండి ముంబైకి కలిసిరాని మొదటి మ్యాచ్...

ఐపీఎల్ టోర్నీలో విజయవంతమైన జట్టు ఏది అంటే అందరూ ముంబై ఇండియన్స్ జట్టు పేరు చెప్తారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్ అందుకున్న ఏకైక జట్టు ముంబై. అయితే ఈ జట్టు విజయపరంపర హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆ జట్టు పగ్గాలు చెప్పటినప్పటి నుండి మొదలయ్యింది. రోహిత్ 2013 లో ముంబై జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇక అదే  ఏడాది జట్టుకు కప్ అందించిన రోహిత్ ఆ తర్వాత 2015, 2017, 2019 లో జట్టును విజేతగా నిలిపాడు. ఇది అందరికి తెలిసిన విషయం. కానీ రోహిత్ ఎప్పుడైతే ఆ జట్టుకు కెప్టెన్ అయ్యాడో అప్పటి నుండి ఆ జట్టుకు లీగ్ లో మొదటి మ్యాచ్ కలిసి రావడం లేదు. అవును.. 2013 నుండి మొదలు పెడితే నిన్న ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన మొదటి మ్యాచ్ వరకు ముంబై అన్ని ఓడిపోయింది. నిన్నటి మ్యాచ్ లో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన ముంబై జట్టు ఆ తర్వత చెన్నై బ్యాట్స్మెన్స్ ను నిలువరించలేక 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్ ఈ నెల 23న కోల్‌కత నైట్ రైడర్స్ తో ఆడనుంది.