ఆటగాళ్లకు ఉంగరాలు ఇచ్చిన ముంబై ఇండియన్స్...

ఆటగాళ్లకు ఉంగరాలు ఇచ్చిన ముంబై ఇండియన్స్...

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020ని ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. ఇందులో అన్నిటికంటే ఆటగాళ్ల భద్రతే ముఖ్యంగా బీసీసీఐ ముందడుగులు వేస్తుంది. ఇప్పటికే అక్కడికి వెళ్లిన చెన్నై జట్టులో కరోనా రావడంతో మిగిత జట్లు తమ తమ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లకు ఉంగరాలు బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ మధ్య కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఎక్కువగా కరోనా లక్షణాలు కనిపించడం లేదు. అందుకే ఎంఐ తమ ఆటగాళ్లకు స్మార్ట్ ఉంగరాలు ఇచ్చింది. వీటితో ఆటగాళ్ల గుండె వేగం, శ్వాసలో హెచ్చుతగ్గులు, శరీర ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని స్వేకరించవచ్చు. అందులో వారికి ఏమైనా తేడాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంఐ ఈ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ ఏడాది జరగదు అనుకున్న ఐపీఎల్ జరుగుతుంది అని బీసీసీఐ తెలిపినప్పటి నుండి జట్లు తమ ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు.