ముంబైకి కలిసిరాని ప్రారంభ మ్యాచ్...

ముంబైకి కలిసిరాని ప్రారంభ మ్యాచ్...

ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్  తలపడాల్సి ఉంది. ఎందుకంటే... గత సీజన్ ఫైనల్ లో ఏ రెండు జట్లు ఆడుతాయో అవే తర్వాతి సీజన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో పాల్గొంటాయి. అలా ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో నాలుగుసార్లు విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు ప్రారంభ మ్యాచ్ ఆడింది. 2009,2014,2016,2018 సీజన్లలో మొదటి మ్యాచ్ ఆడిన ముంబై కేవలం ఒక 2009 లో మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన అన్ని ప్రారంభ మ్యాచ్ లలో ఓడిపోయింది. మరి ఈ ఏడాది కూడా మొదటి మ్యాచ్ ఆడుతున్న ముంబై చెన్నై పై విజయం సాధిస్తుందా... లేదా అనేది చూడాలి. అయితే ఈ లీగ్ పూర్తిగా కరోనా నియమాల మధ్య జరుగుతున్న కారణంగా ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు అందరూ బయో బబుల్ లో ఉండాల్సి ఉంటుంది.