ఫ్యామిలీస్ తో బీచ్ కు వెళ్లిన ముంబై ఆటగాళ్లు...

ఫ్యామిలీస్ తో బీచ్ కు వెళ్లిన ముంబై ఆటగాళ్లు...

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. ఇందుకోసం ఆటగాళ్లు ఒక నెల ముందే అక్కడికి చేరుకున్నారు. అయితే ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు కరోనా నియమాలు తప్పకుండ పాటించాలి. అందుకోసం అక్కడికి వెళ్లిన ఆటగాళ్లు అందరూ ఆరు రోజుల క్వారంటైన్ లో ఉండి ఇప్పుడు ప్రాక్టీస్ ప్రారంభించారు. అలాగే  టోర్నీ మొత్తం వారు బయో- సెక్యూర్ బబుల్‌ లో ఉండాల్సి ఉంటుంది. అందులోకి ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలా.. వద్ద అనే విషయాన్ని బీసీసీఐ ఫ్రాంఛైజీలకే వదిలేసింది. ఒకవేళ అనుమతిస్తే వారు కూడా లీగ్ ముగిసేంతవరకు బయో సెక్యూర్ బబుల్‌లో ఉండాల్సిందే అని చెప్పింది. అయితే ఇందులో కేవలం ఒక ముంబై ఇండియన్స్ మాత్రమే ఆటగాళ్ల  కుటుంబ సభ్యులను అనుమతించింది. భారత్ నుండి వెళ్లేముందు కూడా ఆ జట్టు ఆటగాళ్లు మాత్రమే తమ ఫ్యామిలీస్ తో కనిపించరు. అయితే దుబాయ్ వెళ్లిన తర్వాత నుండి హోటల్ కు మాత్రమే పరిమితం అయిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, మిగిత ఆటగాళ్లు కొంత రిలాక్స్ కావడానికి బీచ్ కు తమ ఫ్యామిలీస్ తో వెళ్లారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇలా చేయడం కొంత చర్చలకు దారితీస్తుంది.