చెన్నై దూకుడు బ్రేక్‌..

చెన్నై దూకుడు బ్రేక్‌..

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో వరుసవ విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ జోరుకు కళ్లెం వేసింది ముంబై.. హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టిన ధోనీసేనకు ఈ సీజన్‌లో తొలి ఓటమి రుచి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు... చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై. తొలుత సూర్యకుమార్‌ యాదవ్‌ 59, కృనాల్‌ పాండ్య 42, హార్దిక్‌ పాండ్య 25 మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబై 170 పరుగులు చేసింది. ఇక 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. కేదార్‌ జాదవ్‌ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా... హార్దిక్‌ పాండ్య (3/20), మలింగ (3/34), బెరెన్‌డార్ఫ్‌ (2/22) చెన్నైకి కళ్లెం వేశారు. దీంతో 37 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. హార్దిక్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. చెన్నై ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఇక వరుసగా మూడు విజయాలు సాధించిన చెన్నై.. నాల్గో మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.