ఉత్కంఠపోరులో ముంబై విక్టరీ..

ఉత్కంఠపోరులో ముంబై విక్టరీ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2019లో భాగంగా చెన్నై చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది ముంబై. 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసింది. పటేల్ 31, అలీ 13, కోహ్లీ 46, డెవీలియర్స్ 70, హెట్‌మెయిర్ 5 పరుగులు చేశారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డికాక్ 23, రోహిత్ శర్మ 48, యువరాజ్ 23, సూర్యకుమార్ యాదవ్ 38, హార్థిక్ పాండ్యా 32 రన్స్ సాధించారు.