ముంబై గ్రాండ్ విక్టరీ

ముంబై గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన 34వ మ్యాచ్‌లో ముంబై గ్రాండ్ విక్టరీ కొట్టింది... కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై ఇండియన్స్... టాస్ గెలిచి ముండై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి ముంబై ముందు 175 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇక పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇండియన్స్ అలవొకగా ఛేదించింది. 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 6 పాయింట్లతో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకురాగా... 10 పాయింట్లలో నాల్గో స్థానంలో కొనసాగుతోంది పంజాబ్.