రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ ఎందుకు మారింది?
క్రికెట్ ప్లేయర్స్ వేసుకునే జెర్సీల వెనుకాల ఓ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ను ప్లేయరే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరి లక్కీ నెంబర్‌ను వాళ్లు ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు. టీమిండియా ఆటగాళ్లు ఈ సెంటిమెంట్‌ను ఎక్కువగా ఫాలో అవుతారు. డాషింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. వన్డేల్లోనూ, టీ20ల్లోనూ 45 నెంబర్ జెర్సీతోనే అతను బరిలోకి దిగుతాడు. కానీ.. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈరోజు అనూహ్యంగా జెర్సీ నెంబర్ 59తో గ్రౌండ్లోకి వచ్చాడు. నెంబర్ ఎందుకు మారిందనే విషయమై అతని అభిమానులు అప్పుడు చర్చలు ప్రారంభించేశారు. సాధారణంగా మన జట్టులో జెర్సీ నెంబర్ 59 విజయశంకర్ది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కూడా విజయ్ శంకర్ ఆ నంబర్ జెర్సీతోనే గ్రౌండ్లోకి దిగాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)