24 శాతం పెరిగిన సంపాదన.. టాప్ 10లో ముఖేష్ అంబానీ..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల 'హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021' జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ధనవంతుల జాబితా నేడు విడుదల చేశారు. ముఖేష్ అంబానీ మొత్తం సంపద గత ఏడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు(సుమారు రూ .6.09 లక్షల కోట్లు) చేరుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇటీవల, చైనా జాంగ్ షాన్షాన్ ఈ వారంలో 22 బిలియన్ డాలర్లను కోల్పోయిన తర్వాత ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఓవైపు కరోనా ఆర్థిక వ్యస్థను అతలాకుతలం చేసినా.. గతేడాది 412 మంది బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకొచ్చినట్టు చెబుతున్నారు.. హరున్ జాబితా ప్రకారం.. దాదాపు ప్రతి వారం 8 మంది కొత్తగా బిలియనీర్లుగా ఆవిర్భవిస్తున్నారట.. ఇక, వారిలో భారత్ నుంచి ఒకరు ఉంటున్నారని పేర్కొంది హురున్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)