ధోనీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్​

ధోనీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్​

కరోనా సెకండ్‌ వేవ్‌‌ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులపై ఎక్కువగానే వుంది. తాజాగా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ధోనీ తల్లి దేవకి దేవి, తండ్రి పాన్ సింగ్​.. రాంచీలోని పల్స్​ సూపర్​ స్పెషాలిటీ​ ఆస్పత్రిలో చేరారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఐపీఎల్​ సీజన్​లో ధోనీ.. చెన్నై సూపర్​ కింగ్స్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. కాగా, నేడు వాంఖడే స్టేడియంలో కోల్‎కతా నైట్ రైడర్స్‎తో చెన్నై జట్టు తలపడనుంది.