ఐపీఎల్ కి ధోని గుడ్ బై చెప్పనున్నాడా...?

ఐపీఎల్ కి ధోని గుడ్ బై చెప్పనున్నాడా...?

యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. దాంతో ధోని కెప్టెన్సీ పై విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ధోని చేసే పనులు చూస్తుంటే అతను ఐపీఎల్ నుండి తప్పుకోనున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ రేస్ లో ఉండటానికి తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై ఓడిన తర్వాత ధోని తన జెర్సీని రాజస్థాన్ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ కు కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ జట్టు యాజమాన్యం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆ తర్వాతి మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిన తర్వాత కూడా మళ్ళీ ధోని తన జెర్సీని పాండ్యా బ్రదర్స్ కు గిఫ్ట్ గా ఇచ్చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఐపీఎల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇలా ధోని తన జెర్సీలను ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు ఇవ్వడం చూస్తుంటే అతను ఐపీఎల్ కు గుడ్ బై చెప్తాడా అనే అనుమానాలు వస్తున్నాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ కెప్టెన్ కూల్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.