ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో నాకు చెప్పాడు : మంజ్రేకర్‌

ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో నాకు చెప్పాడు : మంజ్రేకర్‌

2019 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఎంఎస్ ధోని, ఐపీఎల్ 2020 తో మార్చిలో తిరిగి క్రికెట్ లోకి రావాల్సి ఉంది. కానీ అప్పుడు కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. ఇక సంవత్సరకాలంగా ధోని క్రికెట్ కు దూరమవడంతో అతని పదవి విరమణపై పుకార్లు మొదలయ్యాయి. ఇక ఈ విషయం పై తాజాగా మాజీ క్రికెటర్, కామెంటేటర్  సంజయ్ మంజ్రేకర్‌ స్పందించాడు. ధోని తాను ఎప్పుడు రిటైర్ అవుతాను అనే విషయాన్ని తనకు చెప్పినట్లు తెలిపాడు. మంజేకర్ మాట్లాడుతూ... 2017 కోహ్లీ-అనుష్క పెళ్లి సమయంలో ధోనీతో నేను మాట్లాడాను. అప్పుడు మా మధ్య తన రిటైర్మెంట్ గురించి చర్చ వచ్చినప్పుడు ధోనీ నాతో ఒకే మాట చెప్పాడు. అదేంటంటే... ''మన భారత జట్టులో అత్యంత వేగంగా పరుగెత్తే క్రికెటర్‌ని నేను రేసులో ఓడించినంత కాలం.. క్రికెట్‌లో ఉంటాను. నా దృష్టిలో అదే నా ఫిట్‌నెస్‌కి రుజువు'' అని ధోనీ తనతో చెప్పినట్లు మంజ్రేకర్ వివరించాడు. ప్రస్తుతం భారత జట్టులో వేగంగా పరిగేతే వారిలో కోహ్లీ, పాండ్యా ముందుంటారు.  ఇక ఆ మధ్యలో ధోని పాండ్యాతో రేస్ లో పాల్గొనే విజయం సాధించిన విషయం తెలిసిందే.