వైరల్ వీడియో: స్పెషల్ ఫ్యాన్ తో ధోనీ సెల్ఫీ

వైరల్ వీడియో: స్పెషల్ ఫ్యాన్ తో ధోనీ సెల్ఫీ

భారత క్రికెటర్లలో మైదానంలోనూ, బయట మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజే వేరు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కి దేశవ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. నిన్న ధోనీ ఒక చర్యతో ఎందుకు తనను అభిమానులు అభిమానించి ఆరాధిస్తారో మరోసారి చూపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో బుధవారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి ఒక పెద్దవయసు మహిళాభిమానిని కలుసుకున్నాడు. తన కోసం ఎంతోసేపు వేచి చూస్తున్న ఆ వృద్ధ మహిళను ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఆమెతో వచ్చిన యువతితో చాలాసేపు మాట్లాడాడు. వాళ్లిద్దరితో కలిసి సెల్ఫీ దిగాడు. వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సీఎస్కే జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు.

ఎంఎస్డీ నాయకత్వంలోని చెన్నై జట్టు ఐపీఎల్ 2019లో మొదటి ఓటమి చవిచూసింది. వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 37 పరుగులతో విజయం సాధించింది.