రాకెట్ పట్టిన ధోనీ...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. ఎప్పుడు బ్యాట్ తో అలరించే ధోనీ.. టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్కు ధోనీ దూరమైన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలలో ధోనీ ఆడనున్నాడు. అంటే దాదాపు ఇంకా నెలపైనే ఖాళిగా ఉండనున్నారు. ఈ విలువైన టైంను ధోనీ.. ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భార్య సాక్షి జన్మదిన వేడుకలను కూడా ఘనంగా సెలెబ్రేట్ చేశారు.
అయితే తాజాగా ధోనీ రాంచీకి వెళ్ళాడు. రాంచీలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ధోనీ టెన్నిస్ ఆడాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ పోటోలను చూసిన ధోనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'ఇట్స్ టెన్నిస్ టైమ్' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)