కుల్దీప్ : 20 ఏళ్ల తర్వాత మొదటిసారి ధోని నా వల్ల...

కుల్దీప్ : 20 ఏళ్ల తర్వాత మొదటిసారి ధోని నా వల్ల...

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి అందరికి తెలుసు. గ్రౌండ్ లో ఎటువంటి సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉండటం ధోనీకే సొంతం. అందుకే అతడిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. అయితే అటువంటి మిస్టర్ కూల్ కి కూడా కోపం వచ్చిన ఓ సందర్భం గురించి తెలిపాడు చైనామ్యాన్ బౌలర్ కుల్దీప్. 2017 లో ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోని కోపాన్ని చూసాను అని తెలిపాడు. ఆ మ్యాచ్ లో నా బౌలింగ్ లో శ్రీ లంక బ్యాట్స్మెన్ కుశాల్ పెరెరా మొదటి బంతికి బౌండరీ కొట్టాడు. ఆ తరువాత ఎంఎస్ ధోని నాకు కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు అతను ఏమి చెప్పాడో పూర్తిగా అర్థం కాలేదు అందుకే ఆ విషయాన్ని వదిలేశాను. ఇక తరువాతి బంతిని పెరెరా రివర్స్-స్వీప్ తో ఫోర్ కొట్టాడు. దాంతో ఎంఎస్ ధోని తన కూల్ కోల్పోయాడు అని వివరించాడు.

ఆ తరువాత వెంటనే అతను నా వద్దకు వచ్చాడు. కోపంగా చెప్పాడు, 'నేను ఏమైనా పిచ్చివాడిన? నేను 300 వన్డేలు ఆడాను," నిన్ను చెప్పిన విషయాన్ని నువ్వు పట్టించుకోలేదు అని సీరియస్ అయ్యాడు. అయితే కుల్దీప్ యాదవ్ ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఇక నేను ఆ సమయంలో చాలా భయపడ్డాను మరియు వెంటనే ఏమి జరిగిందో ఆలోచించాను. తరువాత, ఈ మ్యాచ్‌ గెలిచి తిరిగి హోటల్‌కు వెళుతుండగా, నిన్ను ధోనిని కోపం వచ్చిందా అని అడిగాను. అప్పుడు ఎంఎస్ ధోని ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. నాకు అసలు కోపం రాదు, నాకు చివరిగా కోపం వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది. 20 ఏళ్ల తర్వాత మొదటిసారి నా కోపాన్ని చూసారు. అయితే రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో నాకు కోపం వచ్చేది "అని ధోని కుల్‌దీప్ తో తెలిపాడట. భారత్ తరఫున ఆడుతున్నప్పుడు కోపం తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని కాని అప్పుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు అని ధోని తనతో చెప్పాడని కుల్దీప్ వెల్లడించాడు,