జడేజాకు బౌలింగ్ ఇవ్వడంపై ధోని క్లారిటీ..

జడేజాకు బౌలింగ్ ఇవ్వడంపై ధోని క్లారిటీ..

షార్జా వేదికగా నిన్న ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓటమిపాలైంది.  గబ్బర్‌ రెచ్చిపోవడంతో... చెన్నై నిర్దేశించిన  180 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 58, అంబటి రాయుడు 45, జడేజా 33 పరుగులు  చేశారు. అయితే.. నిన్న ఢిల్లీతో మ్యాచ్ లో చివరి ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజాను బౌలింగ్ కు దింపడంపై చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చాడు. "బ్రావో బౌలింగ్ చేయాల్సి ఉన్నాతాను ఫిట్  గా లేనని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు. జడేజా, కరణ్ శర్మ కు మాత్రమే చెరో ఓవర్ మిగిలి ఉన్నాయ్ దీంతో రిస్క్ అని తెలిసినా జడేజాకు అవకాశం ఇచ్చాను" అని ధోని చెప్పాడు. కాగా జడేజా వేసిన ఆ ఓవర్ లో అక్షర్ పటేల్ ఏకంగా 3 సిక్సర్లు కొట్టి చెన్నైకి షాక్ ఇచ్చాడు.