చెన్నై పై విజయం సాధించిన రాయల్స్ ఆటగాడికి ధోని గిఫ్ట్...

చెన్నై పై విజయం సాధించిన రాయల్స్ ఆటగాడికి ధోని గిఫ్ట్...

భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ధోనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. మాములు ప్రజలే కాకుండా తనతో కలిసి ఆడే ఆటగాళ్లలో అలాగే ప్రత్యర్థి జట్లలో కూడా ధోనికి అభిమానులు ఉంటారు. మరి వీరందరిలో ధోని జెర్సీ వద్దు అని ఎవరైనా అంటారా... లేదు. అయితే ధోనికి తాను అభిమానిని అని ఎన్నోసార్లు చెప్పిన ఇంగ్లాండ్ ఆటగాడు బట్లర్ కు ధోని జెర్సీ లభించింది. అయితే ఐపీఎల్ 2020 లో బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ కు అలాగే చెన్నై కి మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు టాప్ ఆర్డర్ మొత్తం విఫలం కావడంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఇక 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాజస్థాన్... బట్లర్ 48 బంతుల్లో 70 పరుగులు చేయడంతో 17.3 ఓవర్లలోనే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ధోనికి ఐపీఎల్ లో 200 మ్యాచ్. ఇందులో బట్లర్ దూకుడు ఇన్నింగ్స్ తో రాజస్థాన్ గెలిచింది. అందువల్ల ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ధోని తన జెర్సీని బట్లర్ కు గిఫ్ట్ గా ఇచ్చేసాడు. ఆ తర్వాత ధోని జెర్సీతో బట్లర్ ఉన్న ఫోటోను రాజస్థాన్ యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.