రివ్యూ: మిస్టర్ కెకె

రివ్యూ: మిస్టర్ కెకె

నటీనటులు: విక్రమ్, అభిహాసన్, అక్షరా హాసన్, లీనా తదితరులు 

సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ ఆర్ గుత్తా

సంగీతం: జిబ్రాన్ 

నిర్మాత: కమల్ హాసన్, టి నరేష్ కుమార్, టి శ్రీధర్ 

దర్శకత్వం: రాజేష్ ఏం సెల్వ

అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విక్రమ్ కు మళ్ళా ఆ స్థాయి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు.  కానీ సరైన హిట్ దొరకడంలేదు.  విక్రమ్ లో టాలెంట్ టన్నులకొద్ది ఉన్నది.  ఇదిలా ఉంటె, సరికొత్త కథనంతో విక్రమ్ మిస్టర్ కెకె గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  

కథ: 

మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది.  అక్షరా హాసన్, అభిహాసన్ లు భార్యాభర్తలు.  అక్షరా హాసన్ గర్భవతిగా ఉండటంతో అభిహాసన్ తాను పనిచేసే హాస్పిటలోనే జాయిన్ చేస్తాడు.  డాక్టర్ గా భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు.  అదే సమయంలో విక్రమ్ గాయాలతో అదే హాస్పిటల్ లో పేషేంట్ చేరుతాడు.  విక్రమ్ మలేషియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో ఉంటాడు.  పోలీసులకు విషయం తెలుస్తుంది.  అదే సమయంలో అక్షరా హాసన్ కిడ్నాప్ కు గురవుతుంది.  విక్రమ్ ను హాస్పిటల్ నుంచి తప్పించాలని అప్పుడే అక్షరా హాసన్ ను అప్పగిస్తామని చెప్తారు.. అభిహాసన్ మిస్టర్ కెకె ను తప్పించాడా..? అసలు విక్రమ్ ఎవరు.. ? అక్షరా హాసన్ ను కిడ్నాప్ చేసింది ఎవరు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

విక్రమ్ సినిమాలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి.  కథ, కథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.  ఇందులో భాగంగానే విక్రమ్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకున్నాడు.  కథ పెద్దగా కొత్తగా లేకపోయినా దర్శకుడు రాజేష్ స్క్రీన్ ప్లేను రాసుకున్న విధానం బాగుంది.  కథ స్లోగా ఓపెన్ అవుతుంది.  పెద్దగా జోష్ కనిపించదు.  విక్రమ్ కు సంబంధించిన సన్నివేశాలు సాధారణంగా ఉంటాయి.  ఫస్ట్ హాఫ్ లో విక్రమ్ ఎవరు అన్నది చూపించకుండా అక్కడక్కడా ట్విస్ట్ లు ఇచ్చి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేశారు.  

విక్రమ్ ఎవరో సెకండ్ హాఫ్ లో చూపిస్తారని, యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్లింగ్ ఇస్తారని అనుకుంటే... అక్కడా పెద్దగా చెప్పడానికి ఏమి లేకుండా పోయింది.  ఒక మాములు ట్విస్ట్ ను ప్రజెంట్ చేసి సినిమాను ముగించాడు.  క్లైమాక్స్ సీన్ ను భారీగా చూపించారు.  ఇదొక్కటే సినిమాకు హైలైట్ గా నిలిచింది.  

 

నటీనటుల పనితీరు: 

చియాన్ విక్రమ్ సినిమా అనగానే ఏదేదో ఊహించుకొని సినిమాకు వెళ్తుంటారు.  అసలు ఇందులో హీరో విక్రమా కదా అనిపిస్తుంది.  విక్రమ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా ఉంటుంది. విక్రమ్ మేకోవర్ కొత్తగా ఉన్నా దానికి తగ్గట్టుగా సన్నివేశాలు లేకపోవడంతో విక్రమ్ నటన సాధారణంగా ఉంది.  అక్షరా హాసన్ కు కూడా పెద్దగా రోల్ లేదు.  కాకపోతే గృహిణిగా ఆకట్టుకుంది.  అభి హాసన్ తన నటనతో ఆకట్టుకున్నాడు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

కథ సాధారణంగా ఉన్నా.. దానికోసం అల్లుకున్న కథనాలు బాగున్నాయి.  కథనాలకు తగ్గట్టుగా సినిమాను ప్రెజెంట్ చేసి ఉంటె సినిమా బాగుండేది.  ప్రజెంటేషన్ చేయడంలో రాజేష్ ఏం సెల్వ తడబడ్డాడు.  జిబ్రాన్ సంగీతం సినిమాకు డబుల్ ప్లస్ అయ్యింది.  సాదాసీదా సన్నిసన్నివేశాలకు కూడా జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ అయ్యింది.  శ్రీనివాస్ ఫొటోగ్రఫీ సినిమాకు రిచ్ నెస్ ను ఇచ్చింది.  

పాజిటివ్ పాయింట్స్: 

యాక్షన్ పార్ట్ 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 

నెగెటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

పాత్రల రూపకల్పన 

చివరిగా : మిస్టర్ కెకె - మేకోవర్ ఒకే... ఫలితం వీకే