సీఎస్‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు లేఖ‌.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి..!

సీఎస్‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు లేఖ‌.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి..!

నిత్యం వార్త‌ల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు.. ఇవాళ ఏపీ సీఎస్ నీలం స‌హానికి లేఖ రాశారు.. సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖ‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కోరారు న‌రసాపురం పార్ల‌మెంట్ స‌భ్యులు ర‌ఘురామ‌కృష్ణంరాజు.. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పోస్టు చేశారని ఆరోపించిన ర‌ఘురామ‌కృష్ణంరాజు... ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై విచారణ జరిపించి.. దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో దేవేందర్ రెడ్డికి ప్రభుత్వం, ఛీఫ్ సెక్రటరీ కార్యాలయం మద్దతు ఉందని భావించి, ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని లేఖలో పేర్కొన్నారు.  ఇక‌, ర‌ఘురామ‌కృష్ణంరాజు లేఖ‌పై ఏపీ సీఎస్ ఎలా స్పందిస్తారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.