టీడీపీకి జేసీ దివాకర్‌రెడ్డి డెడ్‌లైన్...

టీడీపీకి జేసీ దివాకర్‌రెడ్డి డెడ్‌లైన్...

తెలుగుదేశం పార్టీలో రెబల్‌గా మారిపోయారు ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి... తన డిమాండ్లను నెరవేర్చకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే తన నియోజకవర్గం పరిధిలోని అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకువచ్చిన  జేసీ... ఈనెల 25వ తేదీ లోగా... తన డిమాండ్లు పరిష్కరించకుంటే రాజీనామా చేస్తానని అల్టిమేటం పెట్టారు. అనంతపురంలో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించిన జేసీ... పార్టీలోకి వస్తమన్నవారిని కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన డిమాండ్లు పరిష్కారం అయితేనే పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని స్పష్టం చేశారు. 

ఇటీవల నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు జేసీ దివాకర్ రెడ్డి... అప్పటి నుంచి జేసీ సోదరులను బుజ్జగించే ప్రయత్నాలు టీడీపీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇ ఆ వెంటనే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మనం పెట్టడం... చర్చకు స్పీకర్‌ అనుమతించడంతో ఎంపీలంతా విధిగా పార్లమెంట్‌కు హాజరుకావాలని విప్‌ జారీ చేసింది టీడీపీ. అయితే ఈ పరిస్థితులను జేసీ దివాకర్‌రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకున్నారన్న భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. డిమాండ్లను పరిష్కరిస్తామని వెంటనే పార్లమెంట్‌కు హాజరుకావాల్సిందిగా జేసీపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే జేసీ వ్యవహారం టీకప్పులో తుఫాన్‌గా టీడీపీ అధిష్టానం భావిస్తుండగా... మరి జేసీ వెనక్కి తగ్గుతారా? లేదా? అనేది చర్చగా మారింది.