ప్రజా వ్యతిరేకత వస్తే తిరుగుబాటు తప్పదు : సీఎం రమేష్

ప్రజా వ్యతిరేకత వస్తే తిరుగుబాటు తప్పదు : సీఎం రమేష్

ఏపీలో అధికార పార్టీ అరాచకాలు మున్సిపల్ ఎన్నికలలో కూడా కొనసాగుతోంది అని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. సూళ్లూరుపేట 12,14 వార్డులలో మున్సిపల్ అధికారులే నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని,లేకుంటే బిల్డింగ్ పడగొడుతామని బెదిరింపులకు దిగుతున్నారు. వెస్ట్ బెంగాల్ లో ఏ వార్డులు గెలవకపోయినా  అధికారంలోకి వస్తున్నాం. ప్రజా వ్యతిరేకత వస్తే తిరుగుబాటు తప్పదు. ఇదే విధంగా కొనసాగితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను కేంద్ర బలగాలతో నిర్వహించాల్సి వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తాం. మాజీ సీఎం చంద్రబాబును అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సిద్దమైన బిజెపి నేతలను కూడా ఎయిర్పోర్ట్ లలో అడ్డుకోవం, హౌస్ అరెస్టులు చేశారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది అని పేర్కొన్నారు.