కేసీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదిస్తున్నాడు : బండి సంజయ్

కేసీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదిస్తున్నాడు : బండి సంజయ్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. నాటకంలో అద్భుతంగా జీవించే వ్యక్తి ,ఆమె రాష్ట్ర సీఎం అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చూస్తే సిగ్గుతో తల దించుకోవాలి అని చెప్పిన ఆయన విద్యుత్ సవరణ చట్టంపై సలహాలు, సూచనలు ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తీర్మానం చేయడమేంటి అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో వెలుగులు నింపాలన్నదే మోదీ ఆకాంక్ష. అయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గ కేసీఆర్ ఏమీ చేసాడో చెప్పాలి అన్నారు. విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నాడు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్..ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని తెలిపారు. కేసీఆర్ ను ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదిస్తాం అని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తాడో లేదో కేసీఆర్ స్పష్టం చేయాలి. ముందు జీఎస్టీని వ్యతిరేకించిన కేసీఆర్.. తరువాత ఢిల్లీకి వెళ్లి మోడీ కాళ్లు పట్టుకున్నాడు. 15వేల కోట్ల రూపాయలు డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి  అని తెలిపారు. అక్రమంగా వేల కోట్లను కేసీఆర్ సంపాదిస్తున్నాడు అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ నియమించిన తర్వాత పూర్తి స్థాయి విచారణ కేంద్రం చేస్తది. కేసీఆర్ అరాచకాలను రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో లేరు. రైతుల మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటే డిస్కమ్ లకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు అని అడిగారు. ఏపీలో ఇబ్బంది లేనప్పుడు తెలంగాణలో ఎందుకు వస్తుంది. పాతబస్తీలో విద్యుత్ చౌర్యంకు పాల్పడుతుంటే ఎందుకు ఒక్కసారి వెళ్లి పరిశీలించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.