బాబ్రీ కూల్చివేత కేసు.. ఇలా స్పందించిన ఒవైసీ..

బాబ్రీ కూల్చివేత కేసు.. ఇలా స్పందించిన ఒవైసీ..

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోశులైతే మరి కూల్చిందెవరు? అని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ.. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని అడిగారు. సీబీఐ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు భారతీయ న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా ఉందని అన్నారు. తీర్పు వచ్చిన ఈ రోజును బ్లాక్‌డేగా వ్యాఖ్యానించారు. అద్వానీ రథయాత్ర సమయంలో జరిగిన రక్తపాతం గుర్తులేదా? అని ప్రశ్నించిన ఒవైసీ.. ఔర్‌ ఏక్‌ ధఖా లగావో.. బాబ్రీ మసీదుకో హటావో అని అన్న ఉమాభారతి నినాదాలు గుర్తుకులేవా? అంటూ నిలదీశారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలని అన్నారు హైదరాబాద్‌ ఎంపీ అదసుద్దీన్‌ ఒవైసీ. మమ్మల్ని ఖతం చేసి మీరు పదవులు అనుభవించారని మండిపడ్డారు. ఇప్పుడేమో మీ అందరికీ క్లీన్‌చిట్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ సంచలన తీర్పు వెలువడింది. ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలిన సంగతి తెలిసిందే.