ఆ దేశంలో మొదలైన సినిమా సందడి...థియేటర్లకు భారీగా జనాలు...  

ఆ దేశంలో మొదలైన సినిమా సందడి...థియేటర్లకు భారీగా జనాలు...  

యూరప్ దేశాలను కరోనా ఎలా వణికించిందో చెప్పక్కర్లేదు.  ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు కరోనా నుంచి బయటపడుతున్నాయి.   ఫ్రాన్స్ లో లాక్ డౌన్ ఆంక్షలు  సడలించడంతో ప్రజలు యధావిధిగా బయటకు వస్తున్నారు.  ఎప్పటిలాగే పనులు చక్కబెట్టుకుంటున్నారు.  

కరోనా దాదాపుగా కంట్రోల్ కావడంతో అక్కడ సినిమా థియేటర్లు కూడా తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.  దీంతో సోమవారం నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి.  ప్రతి రెండు సీట్లకు మధ్య గ్యాప్ ఉండేలా మధ్యలో మినియన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు.  దాదాపుగా 80 రోజుల తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివస్తున్నారు.  బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం కంటే రెండు గంటల పాటు థియేటర్లో కూర్చోవడం పెద్ద రిస్క్ కాదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.