ఈ గ్రామంలో ఒక్కరూ కూడా ఓటేయలేదు..

ఈ గ్రామంలో ఒక్కరూ కూడా ఓటేయలేదు..

తెలంగాణలలో ఎన్నికల పర్వం ముగిసింది. మొత్తం 69.1 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది ఇంకా పెరగొచ్చని కూడా చెప్పింది. ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా.. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో అత్యల్పంగా ఓటింగ్‌ జరిగింది. గత ఎన్నికలతో పోల్చితే కొన్ని చోట్ల ఎక్కువగా.. కొన్ని చోట్ల తక్కువగా పోలింగ్‌ శాతం నమోదైంది. కానీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మొట్ల తిమ్మాపూర్‌ గ్రామం మాత్రం ఈ  ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ గ్రామం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటేయకుండా ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశారు. కనీస సౌకర్యాలకు నోచుకోని తమ గ్రామాన్ని పట్టించుకున్న నేతలే లేరని.. ఎన్నికలప్పుడు హామీలివ్వడమేగానీ.. అవి ఎప్పుడూ నెరవేరలేదని ఈ గ్రామస్థులు చెబుతున్నారు. ఈ గ్రామస్థులు ఎన్నికలను బాయ్‌కాట్‌ చేసిన విషయం అధికారులకు తెలిసి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వెళ్లి బతిమాలినా  తాము ఎవరికీ ఓటు వేయబోమని స్పష్టం చేశారు.