మోత్కుపల్లిపై వేటు పడింది...

మోత్కుపల్లిపై వేటు పడింది...

గత కొంత కాలంగా టీడీపీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్నా టి.టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై వేటు పడింది. మోత్కుపల్లిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మహానాడు వేదికగా టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ప్రకటించారు. టి.టీడీపీ మహానాడు నుంచి వాయిస్ పెంచిన మోత్కుపల్లి... టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశంతోనే టీడీపీపై, చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నారని టీడీపీ గుర్రుగా ఉంది. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణకే పరిమితం కాకుండా ఏపీ రాజకీయాలపై మోత్కుపల్లి కామెంట్ చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు... ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడం... ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. 

నన్ను పొమ్మనడానికి వాళ్లెవరు:

తెలుగుదేశం పార్టీ నుంచి తనను బహిష్కరించడంపై ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఘాటుగా స్పందించారు. తనను టీడీపీ నుంచి బహిష్కరించే హక్కు వారికెక్కడిదని ప్రశ్నించారు. పార్టీ జెండాను చంద్రబాబు దొంగిలించారని.. ఆ జెండాకు అసలు సిసలు వారసులు నందమూరి కుటుంబమే అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడం.. చంద్రబాబు తీరు తదితర పరిణామాలపై రేపు మీడియా సమావేశంలో మొత్తం వివరిస్తానని నర్సింహులు తెలిపారు. 

మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేశారు... చంద్రబాబు విడుదల చేసిన ప్రకటనను కింది పరిశీలించవచ్చు