ఉప్పెన టీజర్ వచ్చేసింది..

ఉప్పెన టీజర్ వచ్చేసింది..

తెలుగు వెండితెరకు మెగా కాంపౌండ్ నుంచి అనేక మంది యువ హీరోలు పరియం అయ్యారు. అదే విధంగా తాజా మరో హీరో పరిచయం అయ్యేందు రెడీ అయ్యాడు. అతడే వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ఉప్పెన చేసి ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సన్నద్దంగా ఉన్నాడు.ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదాల కాలేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సన దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఎప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇది వైష్ణవ్ తేజ మొదటి సినిమా అయినప్పటికీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాను ఈ ఏడాది థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నారు. దానికి సంబందించిన డేట్‌కు కూడా దాదాపు ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి మరో తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం టీజర్ అతి త్వరాలో రానుందట. మోస్ట్ అవెయిటెడ్ మూకీ ఉప్పెనా టీజర్ త్వరలో  మీ ముందుకి రానుందని మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విటర్ ద్వారా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయం వచ్చేసింది. ఈ రోజు ఉప్పెనా టీజర్ విడుదలైంది. ప్రస్తుతం టీజర్ వైరల్‌గా మారింది. సంక్రాంతి బహుమతిగా విడుదలైన ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌లో దేవుడే వరాలిస్తాడని నాకు అర్థం అయింది. ఎవరికి పుట్టామన్నది మనకు తెలుస్తుంది. కానీ నాకు మాత్రం ఎవరి కోసం పుట్టానో చిన్నప్పుడే తెలిసిపోయింది హీరో చెబుతాడు. దీనిని బట్టి వైష్ణవ్ తేజ్ చిన్నప్పటి నుంచి హీరోయిన్‌న్ ఇష్టపడుతుంటాడని అర్థం అవుతోంది. అంతేకాకుండా ‘లవ్ యూ ఐ’ అని రాసిన కృతి మన మధ్య ఎందుకని ప్రేమను కూడా పక్కన పెట్టేవా అంటోంది. ఇదిలా ఉంటే టీజర్ చివరిలో ఒడ్డున పడిఉన్న హీరోని చూస్తే ఈసినిమా ఓ విషాదాంత ప్రేమ కథ అని సందేహం వస్తుంది. ఏది ఏమయినా ఈ సినిమా టీజర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా పై ఉన్న అంచనాలను టీజర్ మరింత పైకి లేపింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.