ఓ వారం ఆలస్యంగా హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్!

ఓ వారం ఆలస్యంగా హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్!

'మోర్టల్ కాంబాట్'... 1990లలో చాలా మందిని అలరించిన ఫ్రాంఛైజీ. అయితే, ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ రెండు ఇన్ స్టాల్మెంట్స్ తరువాత మళ్లీ జనం ముందుకు రాలేదు. ఇంత కాలానికి ఇప్పుడు తాజా 'మోర్టల్ కాంబాట్' సర్వ సన్నద్ధమైంది. 'మోర్టల్ కాంబాట్ 3' అయినప్పటికీ సింపుల్ గా 'మోర్టల్ కాంబాట్' అనే అంటున్నారు. యూఎస్ లో విడుదల తేదీల్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాలోనూ ఏప్రెల్ 23న యాక్షన్ ప్రియుల ముందుకు రాబోతోంది. మొదట ఏప్రెల్ 16నే సినిమా రిలీజ్ అన్నారు. ఏప్రెల్ 23న ఎట్టకేలకు జనం ముందుకొస్తోన్న 'మోర్టల్ కాంబాట్' పలువురు అంతర్జాతీయ నటులతో రూపొందింది. దేశదేశాల్లోని టాలెంటెడ్ ఆర్టిస్టులతో ఆస్ట్రేలియన్ డైరెక్టర్ సిమోన్ మెక్ కాయిడ్ ఈ ఫాంటసీ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సాగా రూపొందించాడు. 'మోర్టల్ కాంబాట్'లో భూమ్మీది వీరులు ఇతర గ్రహాల్నుంచీ వచ్చిన వారితో మార్షల్ ఆర్ట్స్ యుద్ధాలు చేయటం... విశేషంగా చెప్పుకోవాలి. చూడాలి మరి, 'మోర్టల్ కాంబాట్ 2021' వర్షన్ ఎలా బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తుందో!