రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి... 

రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి... 

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినట్టుగా కనిపిస్తున్నా, తిరిగి విజృంభిస్తున్నాయి.  యూరప్, అమెరికా దేశాల్లో పరిస్థితి దారుణంగా మారిపోయింది.  దీంతో యూరప్ దేశాల్లో తిరిగి ఆంక్షలు విధించారు.  ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అమెరికాలో కేసులు తగ్గుతున్నట్టు కనిపిస్తూనే తిరిగి విజృంభిస్తున్నాయి.  తాజాగా అమెరికాలో 90 వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  రాబోయే రోజుల్లో అనేక మహమ్మారులు ఎటాక్ చేస్తాయని, 85 వేలకు పైగా వైరస్ లు జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నట్టు ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ఫ్లాట్ ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టం సర్వీసెస్ తెలిపింది.  ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 22 మంది నిపుణులు లోతైన పరిశోధన చేశారు.  ఈ పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి.  1918 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆరు మహమ్మారులను ప్రపంచం ఎదుర్కొందని, రాబోయే రోజుల్లో మరిన్ని మహమ్మారులను ప్రపంచం ఎదుర్కొనబోతొందని సర్వేలో తేలింది.