నేటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు...ఇవే కీలకం 

నేటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు...ఇవే కీలకం 

ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.  వర్షాకాల సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించబోతున్నారు.  సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వ తేదీ వరకు మొత్తం 18 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.  వర్షాకాల సమావేశాల్లో 45 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు.  కొత్త బిల్లులు, పెండింగ్ లో ఉన్న బిల్లులు కలిపి మొత్తం 45 బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది.  

ప్రతిరోజూ నాలుగు గంటల చొప్పున ఉభయ సభలు సమావేశం అవుతాయి.  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు శాసనసభ జరుగుతుంది.  అయితే, మొదటిరోజు ఉదయం లోక్ సభ, సాయంత్రం రాజ్యసభ జరుగుతుంది.  కరోనా సమయంలో పార్లమెంట్ లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.  గతంలో జీరో అవర్ లేదని చెప్పినా, మార్పులు చేసి జీరో అవర్ ను తీసుకొచ్చారు.  అదే విధంగా ఇండియా... చైనా బోర్డర్ లో నెలకొన్న పరిస్థితుల గురించి ఉభయసభల్లో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.