వైరల్: కరోనా నుంచి తప్పించుకునేందుకు ఆ కోతి మాస్క్ పెట్టుకుంది... కానీ... 

వైరల్: కరోనా నుంచి తప్పించుకునేందుకు ఆ కోతి మాస్క్ పెట్టుకుంది... కానీ... 

కరోనా వైరస్ దెబ్బకు ప్రజల  జీవన విధానం పూర్తిగా మారిపోయింది.  ప్రతి గంట రెండు గంటలకు ఒకేసారి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బయటకు వెళ్లే సమయంలో మాస్క్ పెట్టుకొని వెళ్లడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు.  ఆరోగ్యసూత్రాలు పాటించమంటే అప్పట్లో లైట్ గా తీసుకున్నారు.  ఎప్పుడైతే కరోనా ఎంటరయిందో అప్పటి నుంచే జిందగీ మారిపోయింది.  

అయితే, కొంతమంది మాత్రం  మాకేం కాదులే, మాకు రాదులే అంటూ బయట చక్కర్లు కొడుతున్నారు.  మనుషుల మాదిరిగానే కోతులు కూడా ఆలోచించగలుగుతాయి.  శుభ్రతను పాటించేందుకు ప్రయత్నం చేస్తుంటాయి.  అందుకు ఓ ఉదాహరణ ఈ దృశ్యమే.  కరోనా కాలంలో ప్రజలు మూతికి మాస్క్ లు తగిలించుకొని తిరుగుతుండటంతో ఓ కోతి తాను కూడా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని అనుకుంది.    రోడ్డుపై దొరికిన గుడ్డను ముఖానికి చుట్టేసుకుంది.  మూతి ముక్కుతో పాటుగా మొహం మొత్తం గుడ్డ కప్పెయ్యడంతో పాపం చాలా అవస్థ పడింది.  దీనికి సంబంధించిన చిన్న వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది.