జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్న సిరాజ్... 

జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్న సిరాజ్... 

నిన్న భారత పేసర్  మహ్మద్ సిరాజ్ తన తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2020 లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఆసీస్ పర్యటనలో సిరాజ్టెస్ట్ జట్టుకు ఎంపిక అయ్యాడు. దాంతో ఈ సమయంలో తాను ఆసీస్ లో ఉన్నాడు. అయితే తన తండ్రి మరణించిన తర్వాత అందరూ అతను తిరిగి భారత్ కు వచ్చేస్తాడు అనుకున్నారు. కానీ సిరాజ్ మాత్రం జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ''తనకు తిరిగి భారత్ కు రావడానికి అవకాశం ఉంది. కానీ సిరాజ్ మాత్రం జట్టుతోనే ఉండాలని నిరించుకున్నాడు. కాబట్టి ఈ క్లిష్టమైన సమయంలో మేము అతనికి తోడుగా ఉంటాము'' అని బీసీసీఐ ట్విట్ చేసింది. అయితే చాలా కాలం తరువాత ఇండియా జట్టుకు ఎంపికైన సిరాజ్ తీసుకున్న ఈ నిర్ణయంతో అతనికి ఆట అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.