సిరాజ్‌పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు
భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ సిరాజును ఆసీస్ ఫ్యాన్స్ మరోసారి టార్గెట్ చేశారు. గబ్బాలో నాల్గో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో కొందరు ఆసీస్ ఫ్యాన్స్ సిరాజ్, సుందర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీం ఇండియా ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేశారు. కొందరు ఇండియా ఫ్యాన్స్ ఆసీస్ సిరీస్‌ను రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. వారం రోజులు గడవక ముందే సిరాజ్‌పై రెండుసార్లు ఆసీస్ ఫ్యాన్స్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు సందర్భంగా రెండు రోజులు జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫ్యాన్స్ తరఫున టీం ఇండియా ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి ఆసీస్ ఫ్యాన్స్ సుందర్, సిరాజ్‌ను అవమానించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)