రామమందిరానికి బంగారు ఇటుక గిఫ్ట్ ఇస్తానంటున్న మొగల్ వారసుడు.!

రామమందిరానికి బంగారు ఇటుక గిఫ్ట్ ఇస్తానంటున్న మొగల్ వారసుడు.!

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరానికి బంగారు ఇటుకను గిఫ్ట్ గా ఇస్తానని మొగల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ ప్రకటించారు. కేజీ బరువున్న బంగారు ఇటుకను ప్రధానికి అందిస్తానని, దానిని మందిర నిర్మాణంలో వాడవచ్చని తెలిపారు. ఇది 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను, నమ్మకాన్ని నిలిపి ఉంచుకునే సమయమని అన్నారు. ఈ సందర్భంగా హిందువులకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానని, ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరినట్టు తెలిపారు. కాగా గతంలో హబీదుద్దీన్ టూసీ బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా తనను నియమించాలంటూ డిమాండ్ చేసాడు.