కరోనా స్ట్రెయిన్ బారినపడిన ఇంగ్లాడ్ స్టార్ ఆల్ రౌండర్...

కరోనా స్ట్రెయిన్ బారినపడిన ఇంగ్లాడ్ స్టార్ ఆల్ రౌండర్...

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కరోనా స్ట్రెయిన్ బారిన పడ్డాడు. ఇంగ్లాండ్ 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వచ్చింది. అయితే ఈ సీరిస్ ఎప్పుడో జరగాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడుతూ ఇక్కడి వరకు వచ్చింది. అయితే ఈ సిరీస్ కోసం లంకకు వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో మొయిన్ అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే తాజగా అది కరోనా స్ట్రెయిన్ అని గుర్తించారు. ఇక శ్రీలంకలో ఇదే మొదటి కరోనా స్ట్రెయిన్ కావడం గమనార్హం. మొయిన్ అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్ వోక్స్ కు అలాగే మిగిత జట్టు సంభ్యులంధరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దాంతో షెడ్యూల్ చేసిన విధంగానే ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య ఈరోజు టెస్ట్ సిరీస్ లోని మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది.