లోక్ సభలో మోడీ కీలక వ్యాఖ్యలు - 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్...
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ తో పాటుగా అనేక విషయాల గురించి చర్చిస్తున్నారు. కాగా, ఈరోజు ఉదయం కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రామజన్మభూమి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రమంత్రి వర్గ సమావేశం పూర్తైన వెంటనే మోడీ పార్లమెంట్ కు వెళ్లి రామమందిరం విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రామమందిరం నిర్మాణం కోసం రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరారు. అయోధ్య తీర్పు అనంతరం ప్రజలు సంయమనంతో ఉన్నారని, దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సెల్యూట్ చేస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. అయోధ్య మందిరం నిర్మాణానికి 67.703 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు. అలానే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సున్ని వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమిని ఇచ్చేందుకు యూపీ సర్కార్ అంగీకరించినట్టు మోడీ పార్లమెంట్ లో పేర్కొన్నారు. ఇక రామమందిరం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)