మోడీ మరో టాస్క్: ఒకపూట భోజనం మానెయ్యండి... ఎవరంటే... 

మోడీ మరో టాస్క్: ఒకపూట భోజనం మానెయ్యండి... ఎవరంటే... 

ప్రధాని మోడీ పిలుపు మేరకు మార్చి 22 న జనతా కర్ఫ్యూ, ఏప్రిల్ 5 న దీపయజ్ఞం టాస్క్ లను దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఆచరించారు.  మార్చి 24 వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నది.  ఇప్పటి వరకు ఆహార కొరత పెద్దగా లేదు.  ఐదు రోజుల క్రితం వరకు దేశంలో పరిస్థితి అదుపులోనే ఉన్నది.  ఏప్రిల్ 7 తరువాత పరిస్థితి  పూర్తిగా అదుపులోకి వస్తుందని అనుకున్నారు.  కానీ, ఎప్పుడైతే ఢిల్లీ మర్కజ్ కు సంబంధించి కేసులు బయటపడ్డాయో అప్పటి నుంచి పరిస్థితి అదుపుతప్పడం మొదలుపెట్టింది.  

అయితే, రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  దీంతో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.  యూరప్, అమెరికా దేశాలను దృష్టిలో పెట్టుకొని ఇండియా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  ఇక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోడీ బీజేపీ కార్యకర్తలకు ఓ టాస్క్ ఇచ్చారు.  ఈరోజు నుంచి కార్యకర్తలు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా ఒకపూట భోజనం మానెయ్యాలని, ఆకలితో ఉన్న వ్యక్తులకు ఆ పూట భోజనం అందించాలని కోరారు.  అలానే, రోజులో ఇద్దరికీ మాస్క్ లు అందజేయాలని కోరారు.  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని మోడీ కోరారు.