సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల భారీ చోరీ..

సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల భారీ చోరీ..

గుంటూరు జిల్లాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మంగళగిరి- గుంటూరు జాతీయ రహదారిపై రూ.80 లక్షల విలువైన మొబైల్‌ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు కంటైనర్‌లో వెళ్తున్న మొబైల్‌ ఫోన్లను దుండగులు దొంగిలించారు. 980 ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన విషయాన్ని తొలుత కంటైనర్‌ డ్రైవర్, క్లీనర్లు గమనించలేదు. వెనుక వస్తున్న ఓ వాహనదారుడు కంటైనర్‌ను ఆపి వెనుక డోరు తెరుచుకుందని డ్రైవర్‌కు తెలపడంతో మొబైల్‌ఫోన్ల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మంగళగిరి సమీపంలోని కాజ టోల్‌గేట్ వద్ద కంటైనర్‌ను డ్రైవర్‌ ఆపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, ఇతర బృందాలతో గాలింపు చేపట్టారు.