బండి సంజయ్ కి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్...

బండి సంజయ్ కి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్...

అరేళ్లలో టీఆరెస్ పార్టీ  చేసిన అభివృది సంక్షేమ కార్యక్రమాలని చూసి పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆరెస్ కు పట్టం కట్టబోతున్నారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీ తో మాట్లాడిన ఆయన... బండి సంజయ్ మాటలను ప్రజలు విశ్వసించరు. అవాస్తవాలతో అభూత కల్పనలతో భూతులు మాట్లాడే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. 2 లక్షలు మంది ఐటి ఉద్యోగాల్లో చేరారు. భారత దేశంలో కేంద్రం, ఇతర రాష్ట్రాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసింది అని చెప్పిన ఆయన మీకు దమ్ముంటే  నీతి ఉంటే నేను చెప్పిన ఉద్యోగాల కల్పన లెక్కలు తప్పు అని నిరూపించు అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు. నీలా ఇష్టం వచ్చినట్లు మేము తిట్ట దల్చుకుంటే ఆ జడివాన లో మీరు కొట్టుకుపోతారు అని పేర్కొన్నారు.  పట్టభద్రుల ఆశలు ఆకాంక్షలు తెలిసిన వారి గా ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు మేము చేసి తీరుతాము. చాలామంది ప్రశ్నించే గొంతులు అంటూ ముందుకు వస్తున్నారు..కానీ తెలంగాణా రావడంతో నే ఆ ప్రశ్నలకు సగం సమాధానం వచ్చింది. మిగతా ప్రశ్నలను సీఎం సమాధాన పరుస్తున్నారు అని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.