ఒక్క రాఖీతో చిత్తూరు రాజకీయాలను మార్చేసిన రోజా?

ఒక్క రాఖీతో చిత్తూరు రాజకీయాలను మార్చేసిన రోజా?

నాకు పదవి రాకుండా చేసింది వారే... నన్ను ఓడించడానికి కుట్రలు పన్నారు...నాపై దాడిచేశారు. నా నియోజకవర్గంలో అ పెద్దాయన అనుచరుల పెత్తనం ఏంటని  గొడవకు దిగారు రోజా. కానీ ఒక్కసారిగా సీన్ మారింది. ఆయన కుటుంబంతోనే రాజీ కుదుర్చుకుందా.... రాఖీ పండుగా వేళ....ఎంపీ మిధున్ కు రోజా కట్టిన  రాఖీ వెనుక రాజకీయం ఏమిటి?

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటోంది. విపక్షంలో ఉన్న ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డానని తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె భావించారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. తీవ్రస్థాయిలో అలకబూనడంతో సీఎం జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ గిరి కట్టబెట్టారు. అయినా కూడా రోజాలో ఏదో తెలియని వెలితి. జిల్లాలో రాజకీయంగా తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటి నుండో నాటుకుపోయింది... ఇదే క్రమంలో పార్టీ అధికారంలోకి వచ్చనప్పుటి నుండి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరం కూడా నడుస్తోంది. ఓ దశలో ఆయనతో డైరెక్ట్ ఫైట్ కు కూడా సిద్ధపడింది. మీడియా వేదికగానే తనను ఇబ్బంది పెడుతున్నరంటూ చెప్పుకోచ్చింది...మొదటి తనకి మంత్రి పదవి దక్కకుండా   చేశారని ...అటు తరువాత గత ఎన్నికల్లో తనను ఓడించాలని చూశారంటూ పెద్దిరెడ్డి అండ్ కో పైన ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక పుత్తూరులో ఓ ప్రారంభోత్సవానికి వెళ్ళిన రోజాపై స్ధానిక నేతలు అమె కారులో పై దాడి చేశారు.  దీని వెనుక పెద్దరెడ్డి హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేసింది రోజా. 

స్ధానిక సంస్ధల ఎన్నికల అయితే రెండు వర్గాల మధ్య వైరం తారాస్దాయికి చేరింది...రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తూన్న నగరి మున్సిపల్ ఛైర్మన్ భర్త కెజి కూమార్,కెజి శాంతి కుటుంబం స్దానిక సంస్ధల ఎన్నికలలో పోటి సిద్ధమయ్యారు..అప్పట్లో రోజా చాలా సీరియస్గానే వాయిస్ మెసెజ్ ద్వారా స్దానిక కేడర్ ను హెచ్చరించింది. వారికి ఎవరైనా సహకరిస్తే ....పార్టీనుండి సస్సెండ్ చేయిస్తానని ప్రకటించింది...అ గోడవ కొనసాగుతూండగానే కెజి కుమార్ షస్టిపూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి,డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ హాజరుకావడాన్ని అమె జీర్ణించుకోలేకపోయారు. 

నిజానికి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో రోజాకు ఎందుకనో మొదటినుంచీ సఖ్యత లేదు. వారితో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. రోజా ఏకంగా ఇదివరకు పెద్దిరెడ్డి తోనే గొడవ పెట్టుకోవడంతో ఆమెతో మనకెందుకులే అని మిగతా ఎమ్మెల్యేలు ఆమెతో దూరంగానే ఉంటున్నారు. మొన్నటి వరకూ పెద్దిరెడ్డి తో గొడవ...  ఇప్పుడు నారాయణస్వామితో తగువు పెట్టుకోవడంతో రోజా జిల్లా రాజకీయాల్లో మరింత ఒంటరి అయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్ నడుస్తున్న వేళ .... పెద్దరెడ్డి తనయుడు ఎంపి మిధున్ రెడ్డికి రాఖీ కట్టి అందరికి షాక్ ఇచ్చారు రోజా...ప్రస్తుతం ఇది ఇటుపెద్దరెడ్డి వర్గంలోను,రోజా వర్గంతో పాటు జిల్లాలోను హాట్ టాఫీక్ మారింది ..మొన్నటిదాకా నిగురుకప్పినా నిప్పులా ఉన్న వీరి గొడవలు ....ఒక్కసారి రాఖీ కట్టిడంతో రాజీ కుదురుచ్చున్నట్లేనా అనే చర్చలు సాగుతున్నాయి..జిల్లాలో ఒంటరిగా మారుతున్ననే భావనలో ఉన్న రోజా ఇలా మనసు మార్చుకుందా...అనే మాటలు వినపడుతున్నాయి..

మొత్తానికి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోజా వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చలు సాగుతున్న వేళ రోజా రాఖీ రాజకీయం ...తో మరో టర్న్ తీసుకుందని అంటున్నారు..