కరోనా కట్టడి పై మిథాలీ సూచనలు...

కరోనా కట్టడి పై మిథాలీ సూచనలు...

చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆతహలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం మన దేశం పైన కూడా బాగానే పడింది. అందువల్ల భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించారు. అయిన ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఈ వైరస్ పై సెలబ్రెటీలు, భారత క్రీడాకారులు ప్రజలకు అవగాహనా కల్పిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ప్రజలకు కరోనా కట్టడి పై కొన్ని సూచనలు చేసారు. మనం అందరం కలిసి ఉంటె తప్పకుండా ఈ కరోనా పై విజయం సాధించగలం అని తెలిపింది. అలాగే అందరూ సామజిక దూరం పాటించాలని తెలియజేసింది మిథాలీ. అయితే ఇంతకముందే మిథాలీ కరోనా బాధితులకు 10 లక్షల విరాళం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ప్రజలకు అవసరమైన కొన్ని వస్తువులను పంపిణి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మిథాలీ.