సంచలన పరిశోధన: వచ్చే మార్చి నాటికి ఇండియాలో రోజుకు 2.8 లక్షల కేసులు... 

సంచలన పరిశోధన: వచ్చే మార్చి నాటికి ఇండియాలో రోజుకు 2.8 లక్షల కేసులు... 

రోజు రోజుకు ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  గతంలో కంటే కరోనా టెస్టులు ఇండియాలో అధికంగా చేస్తున్నారు.  రోజుకు రెండు లక్షలకు పైగా టెస్టులు చేస్తుండగా, 20 నుంచి 23 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.  అటు ప్రపంచంలో కూడా కేసులు భారీ స్థాయిలో  నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఐదు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.  

అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కరోనా కేసుల నమోదుపై సర్వే నిర్వహించింది.  ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి.  2021 మార్చి వరకు ప్రపంచంలో 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని, 18 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తాయని సర్వేలో తేలింది.  ఇప్పుడు నమోదవుతున్న కేసుల కంటే 10 నుంచి 12 రేట్లు కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎంఐటి తెలిపింది.  ఇండియాలో రోజుకు 2.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎంఐటి అంచనా వేస్తోంది.  ఎంఐటి సర్వే ఇప్పుడు వైరల్ అవుతున్నది.