ఎక్సగ్రేషియా విషయంలో వెటకారం పనికిరాదు  

ఎక్సగ్రేషియా విషయంలో వెటకారం పనికిరాదు  

వేములకొండ మృతులకు ఇస్తున్న ఎక్సగ్రేషియా కూరగాయల బేరం లా ఉందన్నారు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం. ఈరోజు ఆయన నల్గొండ జిల్లాలో మాట్లాడుతూ... ఎక్సగ్రేషియా విషయంలో నిన్న మంత్రి గారి వెటకారపు మాటలు సమంజసంగా లేవని వ్యాఖ్యానించారు. మంత్రిగారు వ్యంగ్యంగా 50 లక్షలు కావాలా? అని వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎక్సగ్రేషియా విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా కనీసం 6 లక్షలైనా ప్రమాణంగా తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయని... సవాళ్లు విసురుకోవడం అనేది నా దృష్టిలో వికృతమైన చర్యగా ఆయన వెల్లడించారు. రాజకీయాల పట్ల ఈ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కోదండరాం తెలిపారు.